పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం.. ఎందుకో తెలుసా...

0

  రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చినా తరువాత.. ఆ రాజకీయాలను పక్కన పెట్టి.. పాలన కోసం అందర్నీ కలుపుకొని వెళ్లాలి.. ప్రజలకు మేలు జరిగేలా చూడాలి.. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటివి దాదాపు అసాధ్యం.. గతంలో ఏదైతే జరిగిందో.. ఇప్పుడూ అదే కొనసాగుతోంది..

అధికారంలోకి రావడానికి ఎవరైనా రాజకీయాలు చేస్తారు.. కానీ అధికారంలో వచ్చిన తరువాత రాజకీయలను పక్కన పెట్టి.. రాష్ట్రం కోసం అందరినీ కలుపుకువెళ్తున్న సీఎంపై పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు..

సీఎంపై పవన్పెట్ కళ్యాణ్ పొగడ్తలు.. ఎందుకో చూడండి..

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని చాలామంది మాటల్లో చెపుతారు కానీ.. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం దీన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారంటూ ప్రశంసించారు.

అందుకే స్టాలిన్ పరిపానలన, ప్రభుత్వ పని తీరు తమిళనాడు రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. అందుకే మీకు మనస్ఫూర్తిగా తన అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ పవన్ ట్వీట్ చేశారు.


Tags

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top