Whatsapp Cash back offer

0

Whatsapp రోజు రోజుకు సరికొత్త ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. మారుతున్న కాలానుగూణంగ ప్రజలు యూపీఐ లాంటి సేవలను అధికంగా వినియోగించుకుంటున్నారు.

క్షణాల్లో డబ్బును ఒకరి నుండి మరొకరికి చేరవేసేందుకు ఇలాంటి డిజిటల్ సేవలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా జనానికి ఈ సేవలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే వీటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.ఫలితంగా డిజిటల్ లావాదేవీలు మరింత సులభతరం అయ్యాయి.


తాజాగా వాట్సప్ యాప్ ఒక కొత్త ఆఫర్ వినియోగదారులకు ప్రకటించింది. ఇప్పటికే వాట్సప్ యూపీఐ పేమెంట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కస్టమర్లను ఆకర్షించేందుకు గాను క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఎంపిక చేసింది. ఇందులో ఎంపిక చేసిన కష్టమర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వారికి మాత్రమే ఈ ఆఫర్ అంటూ ప్రకటించింది. 

వాట్సప్ పేమెంట్ ఫీచర్ ద్వారా ఇతరులకు పేమెంట్ చేస్తే మొదటి మూడు లావాదేవీలకు గాను రూ.35 చొప్పున, రూ.105 ₹ను క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 

1₹ నుండి ఎంత పేమెంట్ చేసినా రూ.35 క్యాష్ బ్యాక్ అందిస్తుంది వాట్సప్. డిజిటల్ లావాదేవీలు అత్యధికంగా వాట్సప్ ద్వారానే చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే వాట్సప్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది.

NOTE:-  ఈ తక్కువ కాలం ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కష్టమర్లకు మాత్రమేనని వాట్సప్ ప్రకటించింది


Tags

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top