కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం లక్ష రూ...

0

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 113 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఏయే జోన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అన్న విశేషాలు తెలుసుకుందాం..

Central govt jobs


భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  •  నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 113 మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
  • జోన్‌ల వారీగా ఖాళీల విషయానికొస్తే.. నార్త్ జోన్ (38), సౌత్ జోన్ (16), వెస్ట్ జోన్ (20), ఈస్ట్ జోన్ (21), నార్త్-ఈస్ట్ జోన్ (18) ఖాళీలు ఉన్నాయి.
  • పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇతర ముఖ్యమైన విషయాలు:

  • జీత భత్యాలు: రూ.40,000 - రూ.1,40,000.
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), ఇంటర్వ్యూ, ట్రెయినింగ్‌ ఆధారంగా.
  • దరఖాస్తు ఫీజు: రూ.800
  • దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు(ఫేజ్-1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
  •  దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 27, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 26, 2022
  •  ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.recruitmentfci.in/

Tags

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top