మీ ఫోన్ పోయిందా ? అయితే మీ ఫోన్ ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి.

1
ప్రస్తుతం చాలా మంది తమ ముఖ్యమైన, వ్యక్తిగత డేటాను స్మార్ట్‌ఫోన్‌లోనే స్టోర్ చేసుకుంటున్నారు. అన్ని వివరాలు మొబైల్స్‌లోనే ఉంటున్నాయి. ఎంతో కీలకమైన సమాచారం కూడా ఉంటుంది. అందుకే ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడైనా మరిచిపోయినా, పడిపోయినా లేదా దొంగతానికి గురైనా వెంటనే కొన్ని చర్యలు తప్పకతీసుకోవాలి. వీటి ద్వారా మీ ఫోన్‌ మళ్లీ దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనిపెట్టలేకపోతే మీ విలువైన డేటా అపరిచితుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీ ఫోన్‌ నంబర్‌లను అక్రమ కార్యకలాపాలకు వినియోగించకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఇలా.. స్మార్ట్‌ఫోన్‌ పోయినప్పుడు వెంటనే చేయాల్సిన పనులేంటో చూడండి.

వెంటనే కాల్ చేయండి

ఇంట్లో, రెస్టారెంట్‌లో, క్యాబ్‌లో పొరపాటున ఫోన్‌ మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ మొబైల్‌ దగ్గర లేదని చూసుకున్న ముందే వెంటనే వేరే ఫోన్‌తో కాల్ చేయండి. ఎవరైనా కాల్ ఆన్సర్ చేస్తారమో చూడండి. ఒకవేళ మీ ఫోన్‌ ఎవరైనా లిఫ్ట్ చేస్తే వారితో సమన్వయం చేసుకొని మీ ఫోన్‌ తీసుకోండి.

ఫైండ్ మై డివైజ్‌తో లొకేట్ చేయండి

దాదాపు అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో ఫైండ్ మై డివైజ్ (Find my Device) ఆన్‌లోనే ఉంటుంది. గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉండే ఈ సర్వీస్ మీ ఫోన్‌ ఎక్కడుందో లొకేట్ చేయగలుగుతుంది. అందుకే మీ మొబైల్‌ పోయిన వెంటనే.. కంప్యూటర్ లేదా వేేరే స్మార్ట్‌ఫోన్‌లో ఫైండ్ మై డివైజ్ ఓపెన్ చేసి మీ జీమెయిల్‌తో లాగిన్ అవండి. దాంట్లో ఫైండ్ మై డివైజ్ ఎంచుకుంటే మీ ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉందో కనిపెట్టవచ్చు. అయితే డేటా, జీపీఎస్ ఆన్‌లో ఉంటే ఇది కచ్చితంగా పని చేస్తుంది. ఆ సమయంలో ఇవి ఆఫ్‌లో ఉంటే చివరగా ఎక్కడ మీ ఫోన్ ఆన్‌లో ఉందో ఆ ఏరియాను మ్యాప్‌లో చూపుతుంది.
Phone lost

ఫైండ్ మై డివైజ్‌తో లాక్ వేయండి.. మెసేజ్ పంపండి

ఫైండ్ మై డివైజ్‌ ద్వారా పోగోట్టుకుపోయిన మీ ఫోన్‌కు లాక్ వేయవచ్చు. అలాగే లాక్ స్క్రీన్‌పై కనపడేలా మెసేజ్ పంపవచ్చు. ఆ ఫోన్‌ దొరికిన వారికి.. దాని ఓనర్ మీరేనని కాంటాక్ట్ నంబర్‌ కూడా మెసేజ్‌లో ఉంచవచ్చు.

సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేయాలి

పోయిన మీ స్మార్ట్‌ఫోన్‌కు కాల్ చేసినా ఎవరూ ఎత్తకపోతే వెంటనే మీ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేయండి. వేరే నంబర్‌తో నెట్‌వర్క్ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేసి మీ నంబర్‌పై వెంటనే ఔట్‍గోయింగ్ కాల్స్ బ్లాక్ చేయాలని చెప్పండి. సరైన వివరాలు చెప్తే బ్లాక్ చేస్తారు.

ఫోన్‌ డేటా డిలీట్ చేసేయండి

పై అన్ని ప్రయత్నాలు చేసినా.. ఫోన్‌ దొరకక ఇక పోయినట్టే అని ఫిక్స్ అయ్యాక ఈ పని చేయాలి. ఫైండ్ మీ డివైజ్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని పూర్తి డేటాను ఎరేజ్ చేసేయవచ్చు. మీ మొబైల్‌ ఇక దొరకదని ఫిక్స్ అయ్యాక.. డేటా దుర్వినియోగం కాకుండా ఎరేజ్ చేయడం చాలా ముఖ్యం.

IMEI నంబర్‌ను బ్లాక్ చేయండి

ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మీ ఫోన్‌ పోయిందని నిర్ధారించుకున్నాక ఐఎంఈఐ నంబర్‌ను మీరే బ్లాక్ చేసుకోవచ్చు. https://www.ceir.gov.in/Home/index.jsp వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఐఎంఈఐ నంబర్‌ బ్లాక్ చేయవచ్చు.

ఎఫ్ఐఆర్ నమోదు

స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్ చేసిన తర్వాత వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఇలా అయితే ఒకవేళ మీ ఫోన్‌ను ఎవరైనా అక్రమ కార్యలాపాలకు వినియోగించినా మీరు ప్రమాదంలో పడరు.

Tags

Post a Comment

1 Comments

Thanks for your feedback

  1. Casino de L'Auberge de Casino de LA. de la Casino de L'Auberge de Casino de L'Auberge
    Casino de L'Auberge de Casino Air Jordan 6 Retro de L'Auberge de Casino de 해븐카지노 L'Auberge de Casino de L'Auberge de Casino replica air jordan 18 shoes On sale de High Quality jordan 15 retro L'Auberge de Casino de L'Auberge de Casino de Casino de L'Auberge de Casino de 메리트 카지노 도메인

    ReplyDelete
Post a Comment
To Top