ఉద్యోగ్ ఆధార్ అంటే మీకు తెలుసా? ఉద్యోగ్ ఆధార్ నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

0

 భారతదేశంలో చాలా మందికి ఆధార్ అంటే ఏమిటో తెలుసు. ఆధార్ అనేది ఒక వ్యక్తి గుర్తింపును నిరూపించే పత్రం. అయితే ఉద్యోగ్ ఆధార్ గురించి మీకు తెలుసా? ఉద్యోగ్ ఆధార్ దేని కోసం ? ఉద్యోగ్ ఆధార్  దాని ప్రయోజనాల గురించి వివరాలను తెలుసుకోండి. 

Udyog Aadhar అనేది భారత కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక వ్యాపార గుర్తింపు సంఖ్య.ఇది దేశంలోని సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) జారీ చేయబడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. తర్వాత ఉద్యమ్ నెంబరుగా మార్చారు.  ఇందులో ఉండే 16 అంకెల గుర్తింపు  సంఖ్య UDYAM-XX-00-0000000 రూపంలో ఉంటుంది. దీనినే Udyam Certificate అని కూడా పిలుస్తారు.

భారతదేశంలో ఉద్యోగ్ ఆధార్‌ 18 సెప్టెంబర్ 2015 నుంచి ప్రారంభం అయ్యింది. ఉద్యోగ్ ఆధార్‌ను మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) నిర్వహిస్తుంది, ఉద్యోగ్ ఆధార్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను  మరియు దానికి సంబంధించిన అన్ని యూనిట్లను నిర్వహిస్తుంది.

Udhyog Aadhar uses

ఇది చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతి వ్యాపారానికి అవసరమయ్యే విధంగా చట్టాలను తెచ్చింది. కాని దీనిపై అవగాహణ లేక కొందరు దీనితో పనిలేదని పక్కన పడేస్తున్నారు. కాని ఈ ఉద్యోగ్ ఆధార్ వలన చాలా ఉపయోగాలున్నాయి. 

ఉద్యోగ్ ఆధార్ ప్రయోజనాలు:

ఒక వ్యాపారి ఉద్యోగ్ ఆధార్ కోసం నమోదు చేసుకుంటే, వ్యాపార ప్రయోజనం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలకు అది అర్హత పొందవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP),క్రెడిట్ రేటింగ్ పథకం, వడ్డీ రాయితీ అర్హత సర్టిఫికేట్ (ISEC), దేశీయ మార్కెట్ ప్రమోషన్ స్కీమ్, MSMEలకు సాంకేతికత, నాణ్యత అప్గ్రేడేషన్ మద్దతు వ్యాపార్ పథకం, ఆధార్ కింద వ్యాపారం నమోదు చేయబడితే మార్కెటింగ్ సహాయం అటువంటి పథకాలు ఏవైనా, మీరు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ, మూలధన సహాయాన్ని పొందవచ్చు.

ఉద్యోగ్ ఆధార్ కార్డ్ ఎలా పొందాలి?

 • ఉద్యోగ్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఆధార్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి.
 • https://udyamregistration.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, మీ ఆధార్ కార్డ్ వివరాలను నమోదు చేయండి.
 • OTPని నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ పేజీలో అవసరమైన వివరాలను Fill చేసి, డేటాను మళ్లీ ధృవీకరించండి.
 • ఒకసారి చెక్ చేసి, ధృవీకరించబడిన తర్వాత 'సబ్మిట్'పై క్లిక్ చేయండి.

ఉద్యోగ్ ఆధార్ కోసం అవసరమైన పత్రాలు:

 1. వ్యక్తిగత ఆధార్ సంఖ్య
 2. యజమాని పేరు
 3. యజమాని యొక్క caste కేటగిరీ
 4. వ్యాపారం పేరు
 5. బ్యాంక్ వివరాలు
 6. సంస్థ రకం
 7. ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య
 8. జాతీయ పారిశ్రామిక వర్గీకరణ కోడ్
 9.  జిల్లా పారిశ్రామిక కేంద్రం వివరాలు
 10. ప్రారంభ రోజు.

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top