త్వరలో మూడు రాజధానుల బిల్లు ?వచ్చే అసెంబ్లీలో చర్చ... ఎన్నికలకి ముందే మూడు రాజధానులు...

0

 ఏపీలో మరోసారి మూడు రాజధానుల పై కదలిక మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెర పైకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ న్యాయస్థానని ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఆనూహ్యంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అదే సమయంలో తిరిగి సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును సభలో ప్రవేశ పెడతామని సీఎం జగన్ చెప్పారు.

గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వంద శాతం కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన మాట్లాడారు. రాజధాని అంటే కేవలం భూమి, అక్కడి సామాజిక వర్గమే కాదని, రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని స్పష్టం చేశారు. సీఆర్డీఏ చట్టం అమలుకు తాము వ్యతిరేకం కాదన్న మంత్రి ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి కోసమే భూములను హడ్కోకు తాకట్టు పెట్టామని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

Ap capital news

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కామెంట్స్ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మూడు రాజధానుల  విషయంపై త్వరలో జరగనున్న కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేస్తామని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన అన్ని హామీలను 90 శాతానికి పైగా పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు, పరిశ్రమలను తీసుకొస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా రంగానికి రాష్ట్రం హబ్గా మారబోతోందని మంత్రి చెప్పారు. అమర్ రాజా సంస్థపై వచ్చిన ఫిర్యాదులను నిర్ధారిస్తే టీడీపీ లీడర్స్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన సమయంలో ఆయనతో చలాకీగా మాట్లాడిన చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న మంత్రి అమర్నాథ్.. విలీన ప్రాంతాలకు అదనపు వైద్య బృందాలను పంపుతామని స్పష్టం చేశారు.
కాగా.. గతంలో రాజధాని అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదన్నారు. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే.. హైకోర్టు తీర్పు వెలువరించి ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. ఈ క్రమంలో మంత్రులు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
కేబినెట్ సమావేశంలో ...
ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశంలో దీని పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత ..ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తారని చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top