ఆర్టీసీ ఉద్యోగులకు సిఎం జగన్ అదిరిపోయే శుభవార్త...

0

 ఆర్టీసీ కార్మికులకు సిఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చారు సీఎం జగన్.ఇప్పటివరకు కార్మికులు గానే ఉన్న వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లోకి వచ్చారు.

ఇక తాజాగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన పిఆర్సిని అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది.

Aps rtc

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్టోబర్ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరికీ పిఆర్సి అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంస్థలు పనిచేస్తున్న కార్మికులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల్లూరు రీజియన్ లో నెల్లూరు1, 2 రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావాలి, కందుకూరు డిపోలో 2,951 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితోపాటు ఆర్ఎం కార్యాలయంలోని 60 మంది ఉద్యోగులు మొత్తంగా 3,011 మందికి నూతన పిఆర్సి ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త జీతాలు అందనున్నాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి రూ. 3వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. వీటితో పాటు టిఏ, డిఏలు, ఇతర అలవెన్సులు అందనున్నాయి.

Tags

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top