Ap వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశం...

0

 ఏపీ పాలనా వ్యవస్థలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్లు కీలకంగా మారిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం కీలక ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

AP volunteers

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములు చేయొద్దని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబధించిన ఏ ప్రక్రియలోనూ వారికి విధులు అప్పగించవద్దని కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ సూచించింది. గతంలో కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్..

(ads1)

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం…

  • గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎలక్షన్స్‌కు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉండాలి.
  • ఏ అభ్యర్థి తరఫున కూడా వాలంటీర్స్ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు.
  • ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు,  ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు.
  • రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు.

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top