జగనన్న పధకాన్ని కాపీ కొట్టిన మోడీ.. అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలంటూ కేజ్రీవాల్ లేఖ...

0

 ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ' నాడు-నేడు' పథకం ద్వారా ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది.

మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాలల రూపు రేఖల్నే మార్చివేసింది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులయ్యేలా ఈ 'నాడు-నేడు' పథకం అమలవుతోంది. ఈ పథకంపై ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సీఎం జగన్ పేరు మారు మ్రోగిపోయింది.

అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కాపీ కొట్టి 'పీఎం శ్రీ' పథకంగా అమలులోకి తెచ్చింది. ఈ పథకాన్ని తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించింది. దేశవ్యాప్తంగా 14,500 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసి వాటి రూపురేఖలు మార్చాలని, వచ్చే ఐదేళ్ళలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించించి. అయితే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో కేంద్రం తీరును తప్పుబట్టారు. కేవలం 14,500 పాఠశాలలను బాగు చేయాలంటే 5 ఏళ్ళు పడితే.. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుందో అంటూ చురకలు అంటించారు. ఇలా బిట్ బిట్లుగా కాకుండా ఒకేసారి 10 లక్షల పాఠశాలలను ఈ పథకం కింద బాగు చేయించాలని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్.

"14,500 పాఠశాలలే కాదు, దేశంలో ఉన్న మొత్తం 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని, మేము ఈ పనికి కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను వెంట తీసుకెళ్లండి. మీకు పూర్తి సహకారం అందిస్తామని" ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకాన్ని కాపీ చేస్తే పూర్తిగా కాపీ చేసి.., ఆ పథకం గొప్పతనాన్ని నిలబెట్టాలని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top