మీరు కరెంట్ బిల్లు కట్టాలంటూ కొత్త తరహా మోసం... జాగ్రత అంటున్న పోలీసులు

0

 Fake Electricity Bill Scams : కొత్త తరహా మోసం జరుగుతోంది. విద్యుత్ బిల్లుల పేరుతో కొందరు మోసగాళ్లు.. ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా నమ్మిస్తూ.. సొమ్ము దోచుకుంటున్నారు. ఈ మోసం ఎలా జరుగుతోందంటే..

కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఇలానే ముంబై  డాక్టర్ మోసపోయాడు. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫేక్ మేసేజ్ లతో జాగ్రత్త అని సైబర్ నిపుణులు చెబుతున్నా చాలామంది మోసపోతున్నారు. ప్రజల నుంచి డబ్బు దోచేందుకు మోసగాళ్లు రకరకాల దారులు వెతుకుతుంటారు. ఇదే క్రమంలోనే కొత్తగా ఎలక్ట్రిసిటీ బిల్లుల పేరుతో జరుగుతున్న మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. 

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే కొందరు ప్రజలు విద్యుత్ బిల్లుల పేరుతో జరిగిన మోసాల బారిన పడినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ కొత్త తరహా స్కామ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల్లో కొందరు బాధితులు వేల రూపాయలు కోల్పోయినట్టు తెలుస్తోంది.మోసగించబడే బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండడం గమనార్హం.

తాజాగా ముంబైలో ఓ డాక్టర్ హ్యాకర్ల చేతిలో మోసపోయాడు. ఫేక్ మెసేజ్ ఓపెన్ చేయడం ద్వారా ఏకంగా రూ.48500 పోగొట్టుకున్నాడు. అసలు ఏమిటీ విద్యుత్ బిల్లుల మోసం, ఎలా జరుగుతుందో చూడండి.

మీ విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని మోసగాళ్లు.. ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారు. SMS, వాట్సాప్ ద్వారా ఈ మెసేజ్‌లను సెండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులమంటూ మెసేజ్‌ల్లో పేర్కొంటున్నారు. ఆ మెసేజ్‌లో ఓ ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. మెసేజ్ అందుకున్న వారు కాల్ చేయాలనే మోసగాళ్లు ఫోన్ నంబర్ ఇస్తున్నారు.

Current-bill-scams


ఆ నెంబర్ కు యూజర్ కాల్ చేస్తే బిల్ చెల్లించాలని చెబుతున్నారు. ఇందుకోసం నకిలీ బిల్లులు కూడా పంపుతున్నారు. ఆన్లైన్ ద్వారా వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని, లేకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని మోసగాళ్లు హెచ్చరిస్తున్నారు. దీంతో వారు విద్యుత్ అధికారులేనని నమ్మి చాలా మంది డబ్బు చెల్లిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలోని చాలా ప్రాంతాల్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ స్కామ్ గురించి ట్విట్టర్లోనూ కొందరు పోస్ట్‌లు చేశారు.

Dear Consumer, Your electricity power will be disconnected tonight at 9:30pm from electricity office because your previous month bill was not update. Please contact immediately with our electricity officer at 7800235690 Thank You.

ఇలా మెసేజ్ చేసి ప్రజల నుంచి డబ్బు కాజేసిన కాసేపటికే మోసగాళ్లు ఆ ఫోన్ నంబర్‌ను స్విచ్చాఫ్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా కొందరు ఫ్రాడ్స్టర్స్ ఏకంగా మెసేజ్‌లను హెడర్స్తోనూ పంపుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.

విద్యుత్ బిల్లుల పేరుతో వస్తున్న ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని మహారాష్ట్ర సైబర్ విభాగం కూడా ప్రజలను హెచ్చరించింది. మెసేజ్ సోర్స్‌ను వెరిఫై చేసుకున్న తర్వాతే అది నిజమా కాదా అని నిర్ధారించుకోవాలని సూచించింది.

సాధారణంగా విద్యుత్ బిల్లు చెల్లించాలని డిస్కమ్‌లు పంపే మెసేజ్‌ల్లో వ్యక్తిగత ఫోన్ నంబర్లు ఉండవు. హెల్ప్ లైన్ నంబర్లు ఉంటాయి. అలాగే బిల్లు చెల్లించేందుకు వ్యక్తిగత నంబర్‌కు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బు పంపాలని విద్యుత్ శాఖ అధికారులు అడగరు. అందుకే విద్యుత్ బిల్లు చెల్లించాలని వ్యక్తిగత నంబర్‌తో కూడిన మెసేజ్ వస్తే వెంటనే స్పందించవద్దు. ఆన్లైన్లో మీ బిల్లు వివరాలను చెక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆయా డిస్కమ్‌ల వెబ్సైట్లలో బిల్లు వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మెసేజ్‌ల్లో ఉన్న వారికి కాల్ చేసినా డబ్బు పంపకుండా ఉండాలి.

విద్యుత్ బిల్లు scam అని ఎలా గుర్తించాలి:
మోసగాళ్లు ఆన్లైన్లో మాత్రమే డబ్బును చెల్లించమని అడుగుతారు. ఇది UPI ద్వారా కావచ్చు లేదా మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను కూడా అడగవచ్చు. ఈ వివరాలను అడిగిన వెంటనే  వారు మోసగాళ్లు అని త్వరగా గుర్తుపెట్టుకోవచ్చు.

మోసగించబడే బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండడం గమనార్హం. వృద్దులు ఆన్లైన్ పేమెంట్ మోడ్‌లను ఉపయోగించడానికి బదులుగా మరొక మార్గాన్ని అన్వేశించడం ఉత్తమం.

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top