సినీ ప్రియులకు ఐ బొమ్మ షాక్..ఇకపై ఇండియాలో తమ సేవలను ఆపేస్తున్నట్టు ప్రకటన !

0

 తెలుగు సినీ ప్రేమికులకు ఐ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీలో విడుదల అయిన అన్ని సినిమాలను డబ్బులు వెచ్చించి చూడలేని వారికి హై క్వాలిటీలో ఉచితంగా సినిమాలను స్ట్రీమ్ చేసుకుని లేదా డౌన్లోడ్ చేసుకుని చూసే అవకాశాన్ని ఐ బొమ్మ కల్పిస్తోంది. చాలామంది నెటిజన్లు డబ్బులు వృధా చేయడం ఎందుకని భావిస్తూ ఈ వెబ్సైట్లో నచ్చిన సినిమా డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ అవకాశం ఉండదిక. తెలుగు సినీ ప్రియులకు iBomma వెబ్‌సైట్ మరో బ్యాడ్ న్యూస్ అందించింది. ఎందుకంటే ఇటీవలే తెలుగు సినీ ప్రియులకు వరుసగా షాకలిస్తున్న ఐ బొమ్మ వెబ్సైట్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. అదేమిటంటే తమ వెబ్సైట్ నుంచి సినిమాలను డౌన్లోడ్ చేసే ఆప్షన్ ను శాశ్వతంగా నిలిపివేశామని అయితే కేవలంలో ఆన్లైన్లో మాత్రమే నచ్చిన సినిమాలను స్ట్రీమ్ చేసుకుని చూడవచ్చు అని ఐ బొమ్మ టీం తమ వెబ్సైట్లో ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.నిన్నటి నుంచి ఈ వెబ్‌సైట్‌లో ల డౌన్‌లోడ్ కాకపోవడంతో గమనార్హం. ఇక కొద్ది రోజుల క్రితమే ఐ బొమ్మ తన ఇండియన్ యూజర్లకు షాక్ ఇచ్చింది. అదేమిటంటే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని, ఇక మీదట సినిమాలు వెతుక్కుని చూసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కేవలం లేటెస్ట్ 30 సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక అంతకుముందు కూడా తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటే తామేదో వ్యాపారం చేస్తున్నామంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో పూర్తిగా ఐవమ్మ వెబ్సైట్ నిలిపివేయడానికి కూడా సిద్ధం అయ్యారు. అయితే చివరికి అభిమానుల విజ్ఞప్తి మేరకు ఐబొమ్మ మళ్లీ వెనక్కి తగ్గింది. 

అయితే యూజర్లకు iBOMMA సైట్ మళ్ళీ షాక్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే సినిమాలు డౌన్లోడ్ కాకుండా ఆంక్షలు పెట్టగా.. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇండియాలో తమ ఆపరేషన్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి తిరిగి వచ్చే ఆలోచన లేదని.. తమకు ఎవరూ మెయిల్స్ చేయవద్దని సూచించింది. తమపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

ఇక తాజా నిర్ణయం కూడా ఒక వర్గం ప్రేక్షకులకు షాక్ అనే చెప్పాలి. 

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top