సినీ ప్రియులకు ఐ బొమ్మ గుడ్ న్యూస్ .. మళ్ళీ అందుబాటులోకి సేవలు..

0

 ప్రముక ఓటీటీ చానేల్ ఐబొమ్మ సిని ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని మార్పులు చేర్పుల తర్వాత IBOMMA మళ్లీ ఇంటర్నేట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

తెలుగు సినీ ప్రియులకు ఫ్రీగా హైక్వాలిటీ సినిమాలు అందిస్తున్న iBomma  అనుకున్నట్లే iBomma వెబ్‌సైట్ షట్‌డౌన్ అయినప్పటికీ.. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే మరో డొమైన్ ద్వారా ఇండియన్ యూజర్లు క్వాలిటీ సినిమాలు చూసేందుకు అందుబాటులోకి వచ్చేసింది iBomma. ‘Select Others’ అనే ఆప్షన్ ద్వారా iBomma సైట్‌లో సినిమాలు ఆన్‌లైన్‌లో వీక్షించే సౌలభ్యం ఉందని కొంతమంది ఫ్యాన్స్ నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
అలాగే వెబ్‌సైట్ షట్‌డౌన్ చేసిన 24 గంటల లోపే iBomma నిర్వాహకులు సరికొత్త సాల్యూషన్‌తో ఇండియాలో మళ్లీ రీ-లాంచ్ అయ్యేలా ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అందించారనే చెప్పాలి.

కాగా, అటు తెలుగు వెబ్‌ సిరీస్‌లు.. ఇటు సినిమాలను.. అన్ని ఓటీటీలవే ఒకే చోట చేర్చి.. డౌన్‌లోడ్ ఆప్షన్ ఎనబుల్‌తో ప్రతీ సినీ అభిమానిని ఇంప్రెస్ చేసి.. పాపులర్ అయింది iBomma. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ.. కొంచెం వ్యతిరేకతను మూటగట్టుకుంది. నెమ్మదిగా కొన్ని ఆప్షన్స్ డిసేబుల్ చేసింది.. సర్వీసులను తగ్గించేసింది. చివరికి వెబ్‌సైట్ క్లోజ్ చేసేస్తున్నామంటూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినీ ప్రియులు ఒక్కసారిగా డిస్సపాయింట్ అయ్యారు కూడా.. అయితే.. ఇప్పుడు మళ్లీ iBomma తిరిగి పని చేస్తుండటంతో.. ఫ్యాన్స్ నెట్టింట తెగ జోష్‌లో ఉన్నారు.
దీంతో సినీ ప్రేక్షకుల ఫుల్ కుషి అవుతున్నారు. కానీ ఈ ఫిచర్ లో ఎటువంటి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే సినిమాలు చూడటానికి అవకాశం కల్పించింది. IBOMMA ఇంటర్నెట్ లో నిన్న రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇంకా ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలు చూసేయండి మరి.

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top