మంత్రి రోజా కూతురు ఆ హీరోతో సినిమాలోకి ఎంట్రీ...

0

రోజా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె అప్పట్లో ఎన్నో తెలుగు,తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి అప్పట్లో బిజీ హీరోయిన్ గా మారింది.

వైయస్సార్సిపి పార్టీ లో ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉంది రోజా. అలాగే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని కీలక పాత్రల్లో నటిస్తోంది. అలాగే బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ కి కూడా చాలా రోజులు జడ్జ్ గా వ్యవహరించింది.

ఇక రోజాకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటినుండో రోజా తన కూతురు అన్షుమాలిక ని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం చేయాలని చూస్తోంది.తాజాగా అన్షును హీరోయిన్ గా రోజా పరిచయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్షు.. అమెరికాలోని ఫేమస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు జాయిన్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరో కొడుకు సినిమాతో అన్షు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నదట.

అతను ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్.. ఇటీవలే తండ్రితో కలిసి మహాన్ సినిమాలో నటించి మెప్పించిన ధృవ్.. టాలీవుడ్ లో ఒక సాలిడ్ స్క్రిప్ట్ తో ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడట. విక్రమ్ కు తెలుగు అభిమానులు ఎంత ప్రేమను పంచుతున్నారో ధృవ్ కు కూడా అదే విధంగా ప్రేమను పంచుతారని విక్రమ్ ఆశిస్తున్నాడు. అందుకే మంచి కథ కోసం విక్రమ్ కూడా వెతుకుతున్నాడట. ఇక ఈ చిత్రంలో ధృవ్ సరసన అన్షుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫ్రెష్ ఫేస్, అమాయకమైన చూపుతో తల్లినే మరిపిస్తుంది అన్షు. దీంతో హీరోయిన్ గా ఆమె రాణిస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో యెంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

అయితే అప్పట్లోనే సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తుంది అని ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఇప్పటికీ కూడా సినీ రంగ ప్రవేశం చేయలేదు. అయితే తాజాగా మరొకసారి అన్షు మాలిక హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.


Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top