కేంద్రం కీలక నిర్ణయం.. న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాజ్‌పథ్ పేరు మార్పు.

0

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దీనిలో భాగంగానే..

న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాజ్‌పథ్ & సెంట్రల్ విస్టా లాన్‌లకు 'కర్తవ్య మార్గం'గా పేరు మార్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.

ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు మీద ప్రతిష్ఠించిన జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అదే విధంగా.. ప్రధాని మోదీ ఆగస్టు 15 న తేదీన చేసిన ప్రసంగంలో వలసవాదులు ఏర్పాటు చేసి వెళ్లిన అనేక చిహ్నాలను, మార్పులు చేస్తామని అన్నారు. 

దీనిలో భాగంగానే ఎర్రకోట సమీపంలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు గల మార్గం 'రాజ్‌పథ్‌' పేరు మారనుంది. 'రాజ్‌పథ్‌'ను 'కర్తవ్యపథ్‌'గా మార్చేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది.

Rajpath name change to kartvyapath

రాజ్ పథ్ ను, కర్తవ్యపథ్ గా పేరు మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 
దీనివెనుక ఉన్న కారణాన్ని మోదీ స్పష్టంగా తెలిపారు. దీనిపై చర్చించేందుకు సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సమాచారం.
నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం రోడ్డు, ప్రాంతాన్ని కర్తవ్య మార్గంగా పిలుస్తామన్నారు. బ్రిటిష్ వలస పాలకులు, పాలకుల శకం ముగిసిపోయిందని మోదీ అన్నారు. 
ఇంతకుముందు, మోడీ ప్రభుత్వం నామకరణాన్ని ఎక్కువ మంది వ్యక్తులను కేంద్రీకరించడానికి ఉద్దేశించిన సిద్ధాంతం ప్రకారం, ప్రధానమంత్రి నివాసం ఉన్న రహాదారి పేరు కూడా రేస్ కోర్స్ రోడ్ నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్గా మార్చబడింది.

సెప్టెంబర్ 5, 2022న కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 20 నెలల పునరాభివృద్ధి తర్వాత సెప్టెంబర్ 8న రాజ్‌పథ్ ప్రారంభానికి ముందు కర్తవ్య మార్గంగా పేరు మార్చబడే అవకాశం ఉంది.

Tags

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top