స్మార్ట్ ఫోన్ యూజర్లు కు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ...

0

 ఇప్పటికే మొబైల్ ఫోన్ అందరి జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్న, పెద్ద.. అని తేడా లేకుండా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కామన్ అయ్యాయి. ఇప్పుడు చాలా వరకు పనులన్నీ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. ప్రతి పనికీ మొబైల్ పైనే ఆధారపడుతున్నారు.

 సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగదారులు సైబర్ నేరాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సైబర్ నేరగాళ్లు రివార్డులు, నగదు బహుమతులు అంటూ ఆకర్షిస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లింక్ లు పంపిస్తున్నారు.వాటిని క్లిక్ చేసిన వినియోగదారులు వారి అకౌంట్లలో సొమ్మును పోగొట్టుకుంటున్నారు.

ఇలాంటి క్రమంలో ఆన్లైన్ లో సురక్షితంగా ఉండటానికి స్మార్ట్ఫోన్ వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భారత ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం 'బెస్ట్ ప్రాక్టీసెస్' అంటూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. ఈ సలహాలో పేర్కొన్న విషయాలను అనుసరించడం ద్వారా, స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆన్లైన్లో సురక్షితంగా ఉండవచ్చు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు, ఆన్లైన్లో బ్రౌజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన, చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది.

Central government advice to smart phone users

అవేంటో చుడండి 👇🏻

  • ‌ మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అధికారిక యాప్ స్టోర్లను ( Google Play Store, App Store) మాత్రమే వినియోగించాలి. తద్వారా ప్రమాదకరమైన యాప్లను డౌన్లోడ్ చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  • ‌ ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేయాలనుకుంటే ముందుగా యాప్ వివరాలు, ఎంత మంది ఆ యాప్ ని ,డౌన్లోడ్ చేసుకున్నారు,యాప్ యొక్క రివ్యూ,అదనపు సమాచారం విభాగాన్ని సమీక్షించాలి.
  • ‌యాప్ అనుమతులను ధృవీకరించండి. యాప్ ప్రయోజనంకోసం సంబంధిత సందర్భం ఉన్న అనుమతులను మాత్రమే మంజూరు చేయాలని కేంద్రం సూచించింది. సైడ్-లోడెడ్ యాప్లను ఇన్స్టాల్ చేయడానికి Unknown Sources కి పర్మిషన్ ఇవ్వకండి.
  • ‌వ్యక్తిగత వివరాలు లేదా అకౌంట్ లాగిన్ ఆయె ముందు బ్రౌజర్ చిరునామా బార్లోని ఆకుపచ్చ లాక్ ని తనిఖీ చేయండి. ఇంకా కస్టమర్ తమ ఖాతాలో ఏదైనా అసాధారణ కార్యకలాపాన్ని జరిగితే సంబంధిత వివరాలతో వెంటనే బ్యాంకుకు నివేదించాలి, తద్వారా తదుపరి తగిన చర్యలు తీసుకోవచ్చు.
  • ‌ఏదైనా అనుచిత E-mailలు, SMSలు వచ్చినప్పుడు అందులోని లింక్ పై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
  • ‌నిజమైన మొబైల్ ఫోన్ నంబర్ల వలె కనిపించని అనుమానాస్పద నంబర్లను అవైడ్ చేయండి. స్కామర్లు వారి అసలు ఫోన్ నంబర్ను కనపడకుండా ఉండటానికి ఇమెయిల్-టు-టెక్స్ట్ సేవలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతుంటారు.
  • ‌బ్యాంకుల నుండి వచ్చే నిజమైన SMS సందేశాలు సాధారణంగా పంపినవారి ఫోన్ నెంబర్ కి బదులుగా సెండర్ ఐడిలో బ్యాంక్ యొక్క చిన్న పేరును కలిగి ఉంటుంది కలిగి ఉంటాయి.
  • ‌మీకు వచ్చే smsలు లింక్ పై క్లిక్ చేసే ముందు ఒకసారి చెక్ చేయండి. 
  • ‌వెబ్సైట్ url స్పష్టంగా సూచించే URLలపై మాత్రమే క్లిక్ చేయండి. 
  • ‌యాంటీవైరస్, యాంటిస్పైవేర్ సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ మీ యాంటీవైరస్, ఫైర్వాల్, ఫిల్టరింగ్ సేవలతో సురక్షిత బ్రౌజింగ్ చేయండి.Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top